రెండు కళ్ల సిద్ధాంతంతో పోతే బాబుపై ప్రజలు మూడో కన్ను తెరుస్తారు: నాగం

శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయవద్దని కార్యకర్తలు నాగం జనార్దన్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. తెలంగాణ కోసం తాను కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. తెలంగాణపై మాట్లాడడం వల్లనే తనను సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు. పార్టీ వైఖరికి కట్టుబడి పని చేయాలని తాను చెప్తే అది తప్పయిందని ఆయన అన్నారు. గురువారం ఉదయం నుంచి ఆయన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications