జూన్ నుంచి తెలంగాణ ఉద్యోగుల ఉద్యమ బాట: టిఎన్‌జివోల నేత స్వామిగౌడ్

Swamy Goud
వరంగల్: తాము తెలంగాణ ఉద్యమాన్ని జూన్ నుంచి ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు స్వామిగౌడ్ ప్రకటించారు. సంఘం కార్యవర్గ సమావేశానంతరం ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఇంతకు ముందు తాము తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపేశామని, తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. జూన్‌లోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.

జూన్ 5 నుంచి 30వ తేదీ వరకు ఉద్యమ బాట చేపడుతామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వోద్యోగులు జిల్లా పల్లెబాట నిర్వహిస్తారని, హైదరాబాదులో బస్తీ బాట నిర్వహిస్తారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రజలను కలుస్తారని ఆయన చెప్పారు. తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+