చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రి ఇంట్లో గ్యాస్ లీక్, కిరణ్ కుమార్ రెడ్డికి తప్పిన ముప్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kirankumar Reddy
చిత్తూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లో శనివారం ఉదయం వంట గ్యాస్ లీకైంది. ఆ సమయంలో ముఖ్యమంత్రి ఇంట్లోనే ఉన్నారు. సిబ్బంది గ్యాస్ లీక్‌ను వెంటనే గుర్తించడంతో పెద్ద ముప్పు తప్పింది. చిత్తూరు జిల్లా నగరిపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రెండు రోజుల పర్యటన కోసం కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ఉదయం చిత్తూరు జిల్లాకు వచ్చారు. ఆయన రేణిగుంట విమానశ్రయం నుంచి హెలికాప్టర్ తన స్వగ్రామం నగిరిపల్లికి చేరుకున్నారు.

ముఖ్యమంత్రి తన కోసం వచ్చిన శాసనసభ్యులు షాజహాన్, సికె బాబులతో మాట్లాడుతుండగా వంటింట్లో గ్యాస్ లీకైంది. వంట మనుషులిద్దరు దాన్ని వెంటనే గమనించి రెగ్యులేటర్ తీసేసి గ్యాస్ లీక్‌ను ఆపేశారు. వంటింట్లో మూడు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. మంటలు లేచి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

English summary
Gas leaked in CM Kirankumar Reddy's houde at Nagiripalli village of Chittoor district today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X