హరికృష్ణ అలకపై చంద్రబాబు ఆవేదన, తక్కువేమి చేశానని ప్రశ్న

తాను ఇచ్చిన సమాధానానికి వైయస్సార్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమితికి దిమ్మ తిరిగిందని, ఇటువంటి స్థితిలో హరికృష్ణ అలక దెబ్బ తీసిందని ఆయన అన్నట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆత్మరక్షణలో పడ్డారని, తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారని ఆయన అన్నట్లు తెలుస్తోంది. హరికృష్ణ అలకకు మీడియాలో అతి ప్రాధాన్యం లభించి, మిగతా విషయాలకు ప్రాధాన్యం తగ్గే పరిస్థితి ఏర్పడిందని, ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందని చంద్రబాబు అన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications