నారా లోకేష్ రాజకీయ ప్రవేశంపై చంద్రబాబు వెనక్కి తగ్గారా?

పార్టీ మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు కావడం, మహానాడులో హరికృష్ణ అలక చంద్రబాబును వెనక్కి లాగినట్లు చెబుతున్నారు. మహానాడుకు వచ్చినప్పటికీ హరికృష్ణ ముభావంగానే ఉన్నారు. పైగా, మహానాడులో మాట్లాడాలని అడిగిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడిపై చిర్రుబుర్రులాడారు. మహానాడు వేదిక మీద నందమూరి కుటుంబ సభ్యుల ఫ్లెక్సీలు లేకపోవడం, నారా లోకేష్ ఫ్లెక్సీ ఉండడం హరికృష్ణను తీవ్రంగా బాధ పెట్టినట్లు చెబుతున్నారు. చంద్రబాబు నారా లోకేష్‌ను రాజకీయాల్లోకి తెచ్చి, తన వారసుడిగా నిలబెట్టడానికే ఇదంతా చేస్తున్నారనే అభిప్రాయం హరికృష్ణకు కలిగిందని అంటున్నారు.
నారా లోకేష్ రాజకీయాల్లోకి వస్తే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ బహిరంగంగానే తిరుగుబాటుకు సన్నద్ధమవుతారని చంద్రబాబు గ్రహించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలు సమస్యలు ఎదుర్కుంటున్న పార్టీకి ఇది మరో పెద్ద సమస్యగా మారుతుందని ఆయన అనుకున్నట్లు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతానికి ఆ వివాదానికి తెర దించాలని అనుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications