మాఫియా లీడర్ జగన్ నోరు మూత పడింది, కెసిఆర్ రాజకీయ దళారి

తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సవాల్‌తో జగన్ తోక ముడిచారని మరో నేత ఎర్రన్నాయుడు అన్నారు. అవిశ్వాసం పెట్టాలంటే ఎంత మంది సభ్యులు ఉండాలో జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. అవిశ్వాసానికి ఎంత మంది మద్దతు ఉండాలో తెలియని జగన్ రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు. జగన్‌కు దమ్ముంటే గవర్నర్ వద్దకు తన శాసనసభ్యులను తీసుకు వెళ్లి అవిశ్వాసం లేఖ ఇప్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో జగన్ కాంగ్రెసు పార్టీ పంచన చేరడం ఖాయమన్నారు. కేంద్రమంత్రులు సైతం జగన్ మావాడు అంటున్నారని అన్నారు.
ప్రజల విశ్వాసం కోల్పోతున్న జగన్ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ దుకాణం బందు చేసుకోవాలని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. చంద్రబాబు సవాలుతో జగన్ నోరు మూత పడిందన్నారు. జగన్ ఓ కలుపు మొక్క అని మరో నాయకుడు కాల్వ శ్రీనివాసులు అన్నారు. సర్కారును పడగొట్టే శక్తి ఒక్క టిడిపికే ఉందన్నారు. తాము అవసరమైన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామని అన్నారు. కాంగ్రెసు పాలనలో ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.












Click it and Unblock the Notifications