సినీ యుగ్ ఫిల్మ్ డైరెక్టర్ కరీం మొరానీకి బెయిల్ నిరాకరణ

మొరానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా, సాధారణంగా ఉందని ముంబై జెజె ఆస్పత్రి కార్జియోలజీ, న్యూరో సర్జరీ శాఖ నివేదిక ఇచ్చింది. మొరానీ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తమ ముందు హాజరు కావాలని మే 24వ తేదీన కోర్టు ఆదేశించింది. బెయిల్ నిరాకరణను హైకోర్టులో సవాల్ చేస్తామని కరీం మొరానీ సోదరుడు మొహమ్మద్ మొరానీ చెప్పారు. డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళికి 20 శాతం వాటా ఉన్న కలైంగర్ టీవీ చానెల్‌కు 200 కోట్ల రూపాయలను డిబి రియాల్టీ నుంచి బదలాయించడంలో కరీం మొరానీ సహకరించాడని సిబిఐ ఆరోపించింది. అందుకు గాను అతను ఆరు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు కూడా ఆరోపించింది.












Click it and Unblock the Notifications