హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు క్షమాపణ ఎందుకు చెప్పలేదు?: గండ్ర వెంకటరమణ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gandra Venkata Ramana Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రజలకు ఎందుకు క్షమాపణ చెప్పలేదని కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి సోమవారం ప్రశ్నించారు. చంద్రబాబు తాను చేసిన పలు తప్పులకు క్షమాపణ చెప్పారని కానీ తెలంగాణ ప్రజలకు చేసిన తప్పుకు మాత్రం క్షమాపణ చెప్పలేదని అన్నారు. పార్టీ గతంలో చెప్పిన దానికి కట్టుబడి ఉన్నానని చెబుతున్న చంద్రబాబు తెలంగాణ తీర్మానం పార్లమెంటులో ప్రవేశ పెడితే తమ ఎంపీల మద్దతు ఉంటుందని ఎందుకు స్పష్టం చేయలేదన్నారు.

ప్రత్యేక తెలంగాణపై చంద్రబాబు తీరు పుండొక చోట మందొక చోట అన్నట్టు ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అధిష్టానానికి తాము ఎలాంటి డెడ్ లైన్ విధించడం లేదన్నారు. కాంగ్రెసులోని తెలంగాణ ప్రాంత నాయకులమంతా తెలంగాణకు కట్టుబడి ఉన్నామన్నారు. అందరం ఏకత్రాటిపైనే ఉన్నామని చెప్పారు. తెలంగాణ కోసం త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

English summary
Congress MLA Gandra Venkata Ramana Reddy demanded TDP president Chandrababu Naidu's sorry to Telangana people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X