భార్యను పదేళ్లు నిర్బంధించిన భర్త, జగన్ నేతల పేరుతో బెదిరింపు

East Godavari
విజయవాడ: కట్టుకున్న భార్యను పదేళ్లుగా గృహ నిర్బంధంలో ఉంచి శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించిన ఘటన తూర్పు గోదావరి జిల్లా బిక్కవూరు మండలానికి చెందిన గొల్లమామిడిలో చోటు చేసుకుంది. నల్లమిల్లి వీరవెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి తన భార్య గోవింద మహాలక్ష్మిని పదేళ్లుగా గృహ నిర్బంధంలో ఉంచి హింసిస్తున్నట్టుగా తెలుస్తోంది. సుబ్బారెడ్డి నుండి తప్పించుకొని బయట పడ్డ మహాలక్ష్మి సోమవారం మధ్యాహ్నం ఓ టీవీ ఛానల్‌ను ఆశ్రయించి తన భర్త దురాఘాతాలను బయట పెట్టింది. తనను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా హింసించే వాడని చెప్పింది. వివస్త్రను చేసి బెల్టుతో కొట్టడం, సంసారం పేరుతో కొరకటం, కొడుకు ముందే వెకిలి చేష్టలు చేసేవాడని ఆమె ఆరోపించింది.

పదేళ్లుగా తాను పలుమార్లు సుబ్బారెడ్డి నుండి బయట పడాలనుకున్నప్పటికీ తనకు తల్లిదండ్రులు లేనందున తనను బెదిరించి లోబర్చుకునే వాడని చెప్పింది. తనను నగ్నంగా ఫోటోలు తీసి నెట్‌లో పెడతానని బెదిరించే వాడని చెప్పింది. తన భర్త శాడిస్టులకే శాడిస్టు అని ఆమె ఆరోపించింది. తనను రహస్యంగా పెళ్లి చేసుకున్న సుబ్బారెడ్డి ఆ తర్వాత తనకు అంతకు ముందే పెళ్లయిన విషయాన్ని చెప్పారని అన్నది. నిత్యం కన్నెపిల్లలు కావాలనే రకం అన్నది. ఆయన మానవ రూపంలో మృగం కాబట్టి తనలా మరో ఆడపిల్ల బలి కాకూడదని ఎవరినీ తన ఇంటికి రానిచ్చే దానిని కాదని అంది. తన కొడుకుతోనే అంకుల్ అని పిలిపించుకుంటాడంది. తనకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డితో పాటు పలువురితో మంచి సంబంధాలు ఉన్నాయని తమను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరించే వారని ఆమె తెలిపింది.

గతంలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టినప్పుడు తన భర్త అన్న అయిన బుచ్చిరెడ్డి ఇంట్లోనే బస చేశారని చెప్పింది. ఆ సమయంలో తనకు ఇలా పెద్ద పెద్ద వారితో సంబంధాలు ఉన్నాయని తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరించే వారంది. తాను ఆయన నుండి తప్పించుకొని వచ్చిన తర్వాత కూడా తనను బెదిరించడం ప్రారంభించాడన్నారు. కాగా మహాలక్ష్మి వ్యాఖ్యలను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఖండించారు. సుబ్బారెడ్డిలు చాలా మంది ఉంటారని ఏ సుబ్బారెడ్డి తెలియకుండా ఎలా మాట్లాడుతామన్నారు. మహాలక్ష్మి తన ఇంటికి వచ్చి కలిస్తే ఆమెకు సరైన న్యాయం చేస్తామని చెప్పారు. తాము అలాంటి వారిని ప్రోత్సహించే ప్రసక్తే లేదన్నారు. మీడియా కూడా సంమయనం పాటించి పూర్తి వివరాలు తెలుసున్న తర్వాత ప్రసారం చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+