అమితాబ్ బచ్చన్ సలహాతోనే సింగపూర్‌కు వెళ్లిన రజనీకాంత్

రజనీకాంత్ మూత్ర నాళాల సమస్య మూత్ర పిండాల సమస్యకు దారి తీసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ స్థితిలో అమితాబ్ సలహాను రజనీ కుటంబ సభ్యులు పాటించినట్లు తెలుస్తోంది. రజనీతోనూ, ఆయన భార్య లతతోనూ తాను మాట్లాడుతూనే ఉన్నానని, వారడిగినప్పుడు సింగపూర్ వెళ్లాలని తాను సూచించానని అమితాబ్ చెప్పినట్లు ఓ పత్రికతో చెప్పారు.
అమితాబ్ రజనీకాంత్‌తో కలిసి అంధా కానూన్, హమ్ చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. సూపర్ హిట్ రోబో సినిమాలో రజనీకాంత్‌తో అమితాబ్ కోడలు ఐశ్వర్యా రాయ్ నటించింది. సింగపూర్ ఆస్పత్రి ఐసియులో రజనీకాంత్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications