వర్మకు బెజవాడ రౌడీలు తిప్పలు: విజయవాడవాసుల నిరాహార దీక్ష

Ram Gopal Varma
విజయవాడ: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు బెజవాడ రౌడీలు చిత్రం పేరుకు తిప్పలు తప్పేట్టు లేవు. నాగచైతన్యం ప్రధాన పాత్ర పోషిస్తున్న బెజవాడ రౌడీలు చిత్రం పేరును మార్చాల్సిందేనని విజయవాడ వాసులు దర్శకుడు రాంగోపాల్ వర్మను డిమాండ్ చేస్తూ నగరంలో పలువురు నిరాహాక్షకు దిగారు. ప్రశాంతతకు మారు పేరైన విజయవాడను వివాదాస్పద నగరంగా మార్చే ప్రయత్నాలు వర్మ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వర్మ పేరు మార్చే వరకు తమ పోరాటం ఆపే ప్రసక్తి లేదని వారు చెబుతున్నారు. అవసరమైతే వర్మ బెజవాడ రౌడీలులోని టైటిల్‌ను మార్పించేందుకు కోర్టుకు కూడా వెళతామని హెచ్చరించారు. కోర్టులో వర్మపై క్రిమినల్ కేసు పెడతామని చెప్పారు.

పేరు మార్చే వరకు తమ ఉద్యమం ఆపే ప్రసక్తి లేదన్నారు. బెజవాడ రౌడీలు పేరు తీసేసి బెజవాడ గాంధీ అని పేరు పెట్టుకోవచ్చునని వారు వర్మను డిమాండ్ చేశారు. ఇప్పటికే వర్మకు సన్నిహితుడు అయిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకు వెళ్లామని వారు చెప్పారు. లగడపాటి కూడా మహాత్మా గాంధీ బాటలో నడిచే వ్యక్తి కాబట్టి ఆయన వర్మతో మాట్లాడి పేరు మార్పించేందుకు ప్రయత్నాలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా ఈ నిరాహార దీక్షలో సర్వోదయ మండలి, సమైక్యాంధ్ర జెఏసి తదితరులు పాల్గొన్నారు. కాగా గత కొంతకాలంగా విజయవాడ వాసులు పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలె విజయవాడ రహదారులపై ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేట్టుగా కత్తులు, కటారలతో పరుగెత్తించే సన్నివేశం కూడా వివాదం సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+