ఐసియు నుంచి జనరల్ వార్డుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్

Rajinikanth
ముంబై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం విషయంలో శుభవార్త అందుతోంది. ఆయనను సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో ఐసియు నుంచి జనరల్ వార్డుకు మార్చారు. ఆరోగ్య సమస్యలతో ఆయన సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. రజనీకాంత్ కోలుకుంటున్నట్లు ఇక్కడికి సమాచారం అందింది. అయితే, వైద్యులు గానీ కుటుంబ సభ్యులు గానీ ఆయన ఆరోగ్యం గురించి ఏమీ చెప్పడం లేదు.

మూత్రనాళాల సమస్యలకు, మూత్ర పిండాల సమస్యలకు చికిత్స కోసం రజనీకాంత్‌ను సింగపూర్ తీసుకుని వెళ్లాలని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సూచించారు. శనివారంనాడు ఆయనను నేరుగా విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. పెద్ద యెత్తున అభిమానులు ఉండడంతో, వారు ఆందోళనకు గురవుతారనే ఉద్దేశంతో రజనీకాంత్ ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యులు ఏమీ మాట్లాడడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+