పుట్టపర్తి సత్య సాయి బాబా వ్యక్తిగత మందిరంలో ఏముంది?

Sathya Sai Baba
పుట్టపర్తి: తాళాలు వేసి ఉన్న పుట్టపర్తి సత్య సాయి బాబా వ్యక్తిగత మందిరం యజుర్ మందిర్‌లో ఏమందనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో నిధి ఉండవచ్చుననే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. సత్య సాయి బాబా ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అందులోకి ఇతరులెవరూ ప్రవేశించలేదు. ఆ మందిరం తాళపు చెవులు సత్య సాయిబాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ వద్ద ఉండేవి. సత్య సాయిబాబా తనువు చాలించన తర్వాత ఆయన వాటిని సత్య సాయి సెంట్రల్ ట్రస్టు కార్యదర్శి కె. చక్రవర్తికి అప్పగించారు.

మీడియా కథనాల ప్రకారం - సాయి బాబా యజర్ మందిర్‌లో పెద్ద యెత్తున బంగారం, బహుమతులు, కోట్లాది రూపాయల నగదు ఉన్నాయి. వాటిని భక్తులు బాబాకు సమర్పించినవని చెబుతున్నారు. ఆ మందిర్‌ను తెరిచే విషయంపై సత్య సాయి సెంట్రల్ ట్రస్టు ఏ విధమైన నిర్ణయమూ తీసుకోలేదు. ప్రభుత్వం ఓ ప్రత్యేకాధికారిని నియమించాలని, ఆ ప్రత్యేకాధికారి సమక్షంలో తలుపులు తెరుస్తామని ట్రస్టు సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+