హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య ఇంటికి ముఖ్యమంత్రి కిరణ్: అమీర్ ‌పేట వ్యవహారంపై చర్చ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇంటికి వెళ్లారు. రోశయ్యతో భేటీ అయిన కిరణ్ తాజా రాజకీయ పరిణామాలు, రోశయ్య ఢిల్లీ పర్యటనపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆయన రెండు రోజుల ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి ఆరా తీసినట్లుగా సమాచారం. అయితే రోశయ్యకు గవర్నర్ పదవి వస్తుందనే కథనాలు వెలువడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రోశయ్య ఇంటికి వెళ్లి అమీర్‌పేట భూకుంభకోణంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. రోశయ్యపై ఉన్న ఏసిబి కేసును ఎలా తొలగించాలనే విషయంపైనే ముఖ్యంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

దాంతో పాటు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీలు అవిశ్వాస తీర్మానానికి సవాళ్లు విసురుతున్న వేపథ్యంలో శాసనసభ్యుడిగా చాలా అనుభవం ఉన్న రోశయ్యను విశ్వాస తీర్మానంపై సలహాలు అడిగినట్లుగా సమాచారం. సభాపతి, శాసనమండలి చైర్మన్ తదితర పదవుల భర్తీపై రోశయ్య సలహాలు కోరినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ సీనియర్లతో కలిసి వెళ్లడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి తన పద్ధతి మార్చుకుని సీనియర్ల సలహాలు తీసుకునేందుకు ఉద్యుక్తుడవుతున్నట్టు కనిపిస్తోంది. బుధవారం కూడా గవర్నర్ నరసింహన్‌తో సమావేశం అయిన విషయం తెలిసిందే.

English summary
CM Kiran kumar Reddy went to former CM Rosaiah residence and talk about Ameerpet land scam and delhi tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X