ప్రగల్బాలు కాదు సత్తా చూపించు: జగన్‌కు చంద్రబాబు సవాల్

Chandrababu Naidu
హైదరాబాద్: అవిశ్వాసంపై ప్రగల్బాలు పలికిన వారు ఇప్పుడు తమ సత్తా నిరూపించుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇటీవల తరుచూ జగన్ అవిశ్వాసంపై సవాల్ చంద్రబాబును సవాల్ చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆయన జగన్‌కు ప్రతి సవాల్ విసిరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలం అయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తప్పకుండా అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు. శాసనసభ నియమాలు కూడా అవిశ్వాస తీర్మానంపై చెబుతున్నాయని అన్నారు.

అవిశ్వాసం విషయంలో సిపిఎం, సిపిఐ రెండు లెఫ్ట్ పార్టీలు తమకు మద్దతు ప్రకటిస్తున్నాయని అన్నారు. పది రోజుల్లో తప్పకుండా అవిశ్వాసంపై చర్చ జరగాల్సిందేనని అన్నారు. తెలంగాణ విషయంలో మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణపై నా మాటలు వక్రీకరించరాన్నారు. ఇలాంటివి సరికావని ఆయన మీడియాకు సూచించారు. కేంద్రం నిర్వహించనున్న అఖిలపక్షానికి తాము హాజరయ్యే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ నిర్ణయం కేంద్రంపైనే ఆధార పడి ఉందన్నారు.

సభాపతి, ఉపసభాపతి పదవులకు తాము కూడా పోటీ చేస్తున్నట్టు చెప్పారు. సభాపతిగా కెఇ కృష్ణమూర్తి, ఉప సభాపతిగా సుద్దాల దేవయ్యను పోటీకి దింపుతున్నట్లుగా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+