హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ గుండెపోటుతో మృతి

భజన్ లాల్ రెండు సార్లు హర్యానా ముఖ్యమంత్రిగా పని చేశారు. మొదటిసారి 1979 జూన్ 28వ తేదీ నుంచి 1985 జులై 5వ తేదీ వరకు పనిచేశారు. రెండోసారి 1991 జులై 5వ తేదీ నుంచి 1996 మే 11వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజీవ్ గాంధీ కేంద్ర ప్రభుత్వంలో ఆయన వ్యవసాయ, పర్యావరణ, అటవీ శాఖల మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన 2007లో కాంగ్రెసు నుంచి తెగదెంపులు చేసుకుని హర్యానా జనహిత్ కాంగ్రెసు పార్టీని స్థాపించారు.












Click it and Unblock the Notifications