తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వాన్ని పడగొట్టండి: నాగం జనార్దన్ రెడ్డి పిలుపు

కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌ను కూల్చాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సూచించారు.అవిశ్వాస తీర్మానం తెలంగాణ అంశంపైనే జరగాలని ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కాపాడేందుకు చంద్రబాబునాయుడు డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ విషయంలో మోసానికి పాల్పడిన కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చేందుకు ఇదో మంచి అవకాశమని ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ గజ్జెల కాంతం వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని గెలిపిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గ్రామల నుంచి తరిమి కొడతామని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications