అవిశ్వాసానికి సరే అంటే...: పోటీపై వెనక్కి తగ్గిన తెలుగుదేశం!

ఒకవేళ ప్రొటెం స్పీకరు అవిశ్వాస చర్చకు అంగీకరించని సమయంలో సభాపతి పోటీకి రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సభాపతి ఎన్నిక కోసం జరుగుతున్న ప్రత్యేక సమావేశాలలో అవిశ్వాసానికి మార్గం లేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రొటెం స్పీకరుకు ఆ హక్కు ఉంటుందని టిడిపి భావిస్తుందని తెలుస్తోంది. కాగా శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను కలిసి సభాపతి ఎన్నికకు సహకరించాలని కోరారు. చంద్రబాబు అందుబాటులో లేక పోవడంతో ఆయన పయ్యావులను కోరారు. ఈ విషయాన్ని తమ అధినేత దృష్టికి తీసుకు వెళతానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications