ఎన్నికలకు అప్పుడే వైయస్ జగన్ రెడీ, అభ్యర్థుల ఎంపికకు సర్వేలు

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించాలని ఆయన తలపెట్టారు. ప్రతి నియోజకవర్గానికి ముగ్గురేసి అభ్యర్థులను గుర్తించి, వారి జయాపజయాలపై వరుస సర్వేలు నిర్వహించాలని ఆయన అనుకుంటున్నారు. కడప లోకసభకు, పులివెందుల శాసనసభకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు సర్వే ఫలితాలను పోలి ఉండడంతో సర్వేలను నమ్ముకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురేసి అభ్యర్థుల్లో సర్వే ఫలితాలను, జిల్లా ఇంచార్జీలు, ఎన్నికల పరిశీలకులు ఇచ్చే నివేదికలతో పోల్చి అభ్యర్థిని ఎంపిక చేయాలని ఆయన అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications