బొత్స సత్యనారాయణ కన్నా మంచి పిసిసి చీఫ్ ఎవరుంటారు: డిఎస్

D Srinivas
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కన్నా మంచి నాయకుడు ఎవరుంటారని పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్న డి. శ్రీనివాస్ ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడం గొప్ప విషయమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ నాయకులు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడంలో ప్రత్యేకత ఏమీ లేదని, ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు మాట్లాడడం గొప్ప విషయమని, రాష్ట్ర విభజనకు బొత్స సత్యనారాయణ పలు మార్లు అనుకూలంగా మాట్లాడారని ఆయన వివరించారు. తాను పిసిసి అధ్యక్షుడిగా ఉండి తెలంగాణవాదినని చెప్పుకున్నానని, తెలంగాణకు అనుకూలంగా ఉంటానని చెప్పానని ఆయన గుర్తు చేశారు.

పిసిసి పదవి తెలంగాణ నాయకుడిగే ఇవ్వాలనే సంప్రదాయం ఏమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ నాయకుడే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సందర్భాలున్నాయని ఆయన అన్నారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన మల్లికార్జున్ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ కోసం అవసరాన్ని, సందర్భాన్ని బట్టి చేయాల్సింది చేస్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి సహకరించడం, పార్టీని బలోపేతం చేయడానికి పని చేయడం తన ముందున్న కర్తవ్యాలని ఆయన అన్నారు.

తాను ఏమీ కోరుకోవడం లేదని, ఏ పదవీ ఆశించడం లేదని ఆయన చెప్పారు. ఊహించినదాని కన్నా ఎక్కువే తనకు అవకాశాలు వచ్చాయని ఆయన చెప్పారు. తనకు సంతృప్తి ఉందని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్షుడిగా తాను బాగానే పని చేశానని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తనకు పడడం లేదనే మాటల్లో నిజం లేదని, అదంతా మీడియా సృష్టేనని ఆయన అన్నారు. తాను మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పని చేశానని ఆయన చెప్పారు. పిసిసి అధ్యక్షుడిగా తనకు రెండు సార్లు అవకాశం ఇచ్చిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పారు. తనకు సహకరించిన పిసిసి కార్యవర్గానికి, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ ఇవ్వబోమని తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అనలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో తాము కొన్ని అడుగులు ముందుకు వేశామని, తెలంగాణ సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుందని ఆజాద్ అన్నారని ఆయన వివరణ ఇచ్చారు. తెలంగాణ సమస్య జఠిలమైందని, పరిష్కారానికి సమయం పడుతుందని మాత్రమే ఆజాద్ అన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత స్థితిలో పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ తప్ప ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. పార్టీని పద్ధతిలో పెడతారని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+