సోనియా కనుసన్నుల్లో కెసిఆర్, ఆయన వెనుక కోదండరాం: ఎర్రబెల్లి

తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు మంగళవారం ఆరోపించారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాంను తెలుగుదేశం పార్టీపై ఆరోపణలకు ఉసిగొల్పుతున్నది టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ అని ధ్వజమెత్తారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
నిజామాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న నిర్వహించనున్న తెలంగాణ నగారాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున అమరవీరుల కుటుంబాలకే టిక్కెట్ కేటాయిస్తామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ సాధిస్తామని చెబుతూ చేస్తున్న ఢిల్లీ యాత్రను తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మరన్నారు.












Click it and Unblock the Notifications