కిరణ్ కుమార్ రెడ్డితో బొత్స సత్యనారాయణ నెట్టుకు రాగలరా?

కడప, పులివెందుల ఉప ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి అనుసరించిన వ్యూహంపై బొత్స సత్యనారాయణ ఫలితాలు వెలువడిన తర్వాత వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణను నియమించవద్దని ముఖ్యమంత్రి అధిష్టానాన్ని కూడా కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ కాంగ్రెసు అధిష్టానం బొత్స సత్యనారాయణను పిసిసి అధ్యక్షుడిగా నియమించింది. ఈ స్థితిలో ఇద్దరి మధ్య సమన్వయం ఎలా కుదురుతుందనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్న డి. శ్రీనివాస్‌తో కూడా ముఖ్యమంత్రికి సరైన సంబంధాలు లేవనే ప్రచారం ఉంది. ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉంది. ముఖ్యమంత్రి పనితీరుకు బొత్స సత్యనారాయణ ఎప్పటికప్పుడు అడ్డు పడే అవకాశాలున్నాయి. ఈ స్థితిలో ఇరువురి మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏమైనా, పిసిసి పదవి బొత్స సత్యనారాయణకు కత్తి మీద సాము వంటిదే.












Click it and Unblock the Notifications