మంత్రి పదవి నుంచి డిఎంకె నేత దయానిది మారన్‌కు ఉద్వాసన?

దయానిధి మారన్ రాజీనామా అడుగుతారా అని ప్రశ్నిస్తే చట్టాన్ని అమలు చేసే సంస్థలు ఆ విషయాన్ని చూసుకుంటాయని, భయాలూ పక్షపాతమూ లేకుండా పని చేసేందుకు వాటికి స్వేచ్ఛ ఇచ్చామని ఆయన జవాబిచ్చారు. సెకండ్ జనరేషన్ స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా సిబిఐ ఎయిర్‌సెల్ మాజీ చీఫ్ సి. శివశంకరన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
ఎయిర్‌సెల్‌లో తన వాటాను మాక్సిస్‌కు విక్రయించాలని డిఎంకె పార్లమెంటు సభ్యుడు, చేనేత మంత్రి దయానిధి మారన్ తనపై ఒత్తిడి తెచ్చాడని శివశంకరన్ ఆరోపించారు. ఎ రాజా, కనిమొళి తర్వాత 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఇరుక్కున్న మూడో డిఎంకె నేత దయానిధి మారన్.












Click it and Unblock the Notifications