సత్య సాయి బాబా అవతారమని చెప్పుకుంటున్న బలిజ రమేష్?

Sathya Sai Baba
అనంతపురం: అనంతపురం జిల్లాలోని ఓ యువకుడు తానే పుట్టపర్తి సత్య సాయిబాబా అవతారమైన ప్రేమ సాయిని అని ప్రకటించుకున్నాడు. ఈ యువకుడికి సంబంధించిన వార్తాకథనాలను తెలుగు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. అనంతపురం జిల్లా కమ్మటూరు గ్రామానికి చెందిన బలిజ రమేష్ అనే యువకుడు తనను తాను ప్రేమసాయిగా ప్రకటించుకోవడంపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బలిజ రమేష్ ముఖం పోలికలు అచ్చంగా ప్రేమసాయి చిత్రాన్ని పోలి ఉంది. తాను ప్రేమసాయిగా అవతరిస్తానని సత్యసాయి బాబా చెప్పిన విషయం తెలిసిందే. ప్రేమసాయి చిత్రానికి రూపకల్పన చేశారు.

తనను ప్రేమసాయిగా చెప్పుకుంటున్న రమేష్ భక్తులకు విభూది, రాగి ఉంగరాలు ప్రదానం చేస్తున్నాడు. అతన్ని చూడడానికి ప్రజలు రావడం ప్రారంభమైంది. అయితే, ప్రేమసాయి కర్ణాటకలోని గునపర్తిలో జన్మిస్తాడని సత్య సాయి బాబా చెప్పారని అంటున్నారు. ప్రేమ సాయి తాను తనువు చాలించిన ముప్పయి ఏళ్ల తర్వాత జన్మిస్తాడని సత్యసాయి బాబా 1963 జులైలో ప్రకటించారు. అతని హయాం స్వర్ణయుగంగా ఉంటుందని కూడా చెప్పారు. 2126లో ప్రేమసాయి అవతారం చాలిస్తాడని కూడా చెప్పారు. ప్రేమసాయికి 2051లో కళ్యాణ యోగం ఉంటుందని కూడా చెప్పారు.

సత్య సాయిబాబా మరణించిన తర్వాత ప్రేమసాయి జన్మిస్తారనే నమ్మకంతో భక్తులు ఎక్కువగా బలిజ రమేష్ వాదనను అంగీకరించడం లేదు. సత్యసాయి బాబా వచ్చి ప్రకటించుకునే వరకు తాము నమ్మబోమని అంటున్నారు. ఏమైనా, బలిజ రమేష్ తన పోలికలను ఆసరా చేసుకుని కొత్త డ్రామాకు తెర తీసినట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+