వైయస్ జగన్, తెలంగాణ ఎఫెక్ట్: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా!

రిజర్వేషన్‌లలో 50 శాతం దాటకూడదన్న సుప్రీం తీర్పు ప్రకారం ప్రభుత్వం వెనక్కి తగ్గినప్పటికీ ప్రముఖంగా ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెసు స్థానిక ఎన్నికలను ఎదుర్కునే సత్తా లేకనే వెనక్కి తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. సీమాంధ్రలో జగన్ ప్రభావం, తెలంగాణలో ఉద్యమ తీవ్రత దృష్ట్యా అధికార కాంగ్రెసు పార్టీ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ఘోర పరాజయం మూటగట్టుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెసుకు నాయకత్వ సమస్య కూడా ఉంది. పార్టీకి లాభం కలుగుతుందన్న దశలోనే ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. సర్పంచ్, జెడ్పీటీసి, ఎంపీటీసిలతో పాటు సెప్టెంబర్‌లో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించే విషయంలో కూడా ప్రభుత్వం మరో ఆలోచన చేసే పరిస్థితి కనిపిస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెనక్కి పోతుందనే వాదనలు వినిపిస్తున్నప్పటికీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications