అనంతపురం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు నేత వైయస్ జగన్ ఓదార్పు
Districts
oi-Pratapreddy
By Pratap
|
అనంతపురం: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్త తట్టుకోలేక అనంతపురం జిల్లాలో ప్రాణాలొదిలిన వారి కుటుంబాలను ఓదార్చి స్వాంతన చేకూర్చేందుకు త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోన్‌రెడ్డి ఓదార్పు యాత్ర చేపడుతున్నట్లు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు తోపుదుర్తి కవిత తెలిపారు. రెండు రోజుల్లో రూట్ మ్యాప్ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని చెప్పారు.
ఓదార్పు యాత్ర కోసం జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. వైఎస్ మరణవార్త తట్టుకోలేక జిల్లాలో 15 మంది ప్రాణత్యాగం చేశారన్నారు. వారి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కలిసి ఓదారుస్తారని ఆమె వివరించారు. జగన్ ఇటీవల విజయనగరం జిల్లాలో ఓదార్పు యాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే.