బాబా రామ్‌దేవ్ ఆరోగ్యం ఆందోళనకరం: డెహ్రాడూన్ ఆసుపత్రికి తరలింపు

భారీ భద్రత మధ్య బాబాను ప్రభుత్వం డెహ్రాడూన్ వైద్యశాలకు పంపించింది. అక్కడ బాబాను ఐసియులో ఉంచారు. కాగా బాబా ఆరోగ్యం క్షీణించిందని తెలియడంతో ఆయన అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ఆందోళన చెందుతున్నారు. బాబా దీక్షను విరమింప జేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్వామి అగ్నివేష్ డిమాండ్ చేశారు. బాబా ఆరోగ్యం విషమంగా ఉన్న దృష్ట్యా కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఇందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications