జూ ఎన్టీఆర్‌కు బాలయ్య షాక్, సోదరుడు హరికృష్ణకు కౌంటర్

Balakrishna-Jr Ntr
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ తన సోదరుడు హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌కు షాక్ ఇచ్చారు. నందమూరి హరికృష్ణను కౌంటర్ చేయడానికి బాలకృష్ణ సిద్ధపడినట్లే కనిపిస్తున్నారు. అందుకు ఆయన తన జన్మదిన వేడుకలను వేదికగా చేసుకున్నారు. తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబానికి ప్రాధాన్యం తగ్గిందనే వార్తలపై ఆయన శుక్రవారం తన జన్మదిన వేడుకల్లో స్పందించారు. ఎన్టీఆర్ కుటుంబానికి పార్టీలో ప్రాధాన్యం తగ్గలేదని, వ్యవస్థలాంటి పార్టీలో అందరూ సమానమేనని ఆయన అన్నారు. తద్వారా ఆయన జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణల వాదనను కొట్టిపారేశారు.

తెలుగుదేశం పార్టీలో నందమూరి, నారా కుటుంబాల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో బాలకృష్ణ ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ పగ్గాలను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో అంతర్గత పోరుకు శ్రీకారం చుట్టారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పార్టీ మాహానాడులో హరికృష్ణ చంద్రబాబుపై అలక వహించిన సూచనలు స్పష్టంగా బయటపడ్డాయి. దానికితోడు, సినిమా షూటింగుల పేరు చెప్పి జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు డుమ్మా కొట్టారు.

చంద్రబాబుతో విభేదిస్తున్న హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు సహాయం అందించేందుకు సిద్ధంగా లేరనేది అర్థమవుతోంది. ఆయన తన బావ చంద్రబాబుకు పూర్తి సహకారం అందించేందుకు సిద్ధపడినట్లు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఆయన తన అల్లుడు నారా లోకేష్ రాజకీయ ప్రవేశానికి కూడా సహకరించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను పోటీ నుంచి తప్పించడమే బాలకృష్ణ ప్రధాన ధ్యేయమని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+