ఆంధ్రా క్రికెట్‌లో ముదిరిన విభేదాలు: ఏసిఏ నుండి నెక్కంటి బహిష్కరణ

Andhra Cricket Association
విజయవాడ: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. ఏసిఏ మాజీ కార్యదర్శి నెక్కంటి వెంకటరావును బహిష్కరిస్తున్నట్టు అధ్యక్షుడు గంగరాజు నోటీసులు జారీ చేశారు. నెక్కంటి ఏసిఏకు 27 ఏళ్లు కార్యదర్శిగా పని చేశారు. ఇటీవల ఆయన ఏసిఏ ఏకపక్ష నిర్ణయాలపై హైకోర్టుకు వెళ్లారు. ఏసిఏ నిబంధనల ప్రకారం కమిటీలోని వారు ఎవరు కూడా కోర్టుకు వెళ్లకూడదు. కోర్టుకు వెళితే చర్యలు తీసుకోవచ్చు. అయితే నెక్కంటి కోర్టుకు వెళ్లిన అనంతరమే ఆయనపై చర్యలు తీసుకుంటారనే వాదనలు వినిపించాయి. అయితే అధ్యక్షుడు గంగరాజు అప్పుడు చర్యలు తీసుకోమని స్పష్టం చేశారు. అప్పటి నుండి ఏసిఏలో ఇరు వర్గాల మధ్య విభేదాలు పొడసూపాయి.

అయితే వచ్చే ఎన్నికలలో చాముండి వర్గం నుండి నెక్కంటి వెంకటరావు అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తారనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు గంగరాజు ఆయనను బహిష్కరించారు. వచ్చే ఎన్నికలలో చాముండి వర్గం నుండి నెక్కంటి అయినా మరెవరైనా పోటీ చేస్తే తమకు చెక్ చెబుతారనే ఉద్దేశ్యంతోనే గంగరాజు తనపై బహిష్కరణ వేటు వేశారని నెక్కంటి ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొద్ది కాలం నుండి నెక్కంటిపై వేటు పడుతుందనే వాదనలు వినిపించినప్పటికీ ప్రస్తుతం ఆయనపై వేసిన బహిష్కరణ వేటు మాత్రం అకస్మాత్తుగా జరుగిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+