నోకియాని ఎవ్వరికీ అమ్మడం లేదు: సిఈవో స్టీఫెన్ ఈలాప్

నోకియా డ్యూయెల్ సిమ్ ఫోన్లను ఎపి మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని పూర్తిగా భారత్‌లో తయారు చేశామని, నోకియా సి2-00, నోకియా ఎక్స్1-01 ఫోన్లు అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకుంటాయని భావిస్తున్నామని సంస్థ రీజనల్ జనరల్ మేనేజర్ టిఎస్ సుధీర్ వ్యాఖ్యానించారు. ఈ ఫోన్లలో నోకియా మనీ అప్లికేషన్‌ను ముందుగానే లోడ్ చేసి ఉంచామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులోని ఎంట్రీ లెవల్ డ్యూయెల్ సిమ్ మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఎన్నో విశిష్ఠతలు వీటిల్లో ఉన్నాయని తెలిపారు. 32 గిగాబైట్ల వరకూ ఎక్స్‌పాండబుల్ మెమొరీ సామర్థ్యమున్న సి2-00 ధర 2,500 రూపాయలుగా, 16 జిబి వరకూ పెంచుకోతగ్గ మెమొరీ ఉన్న ఎక్స్1-01 ధర 1,950 రూపాయలని వివరించారు. వీటిని చెన్నైలోని ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications