యూపీఏ నుంచి వైదొలగకూడదని డిఎంకె చీఫ్ కరుణానిధి నిర్ణయం

అయితే పార్టీలోని ఓ వర్గం దీనికి ఒప్పుకోలేదు. కేబినెట్ నుంచి వైదొలిగితే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు అన్నాడిఎంకె సిద్ధంగా ఉందని పేర్కొంది. కరుణకు అళగిరి నచ్చజెప్పారని, ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి నుంచి బయటకొస్తే మరిన్ని సమస్యలొస్తాయని వివరించారని సమాచారం. ఈ అంశంపై ఓ పార్టీ నేతను 2జీ కేసులో జైల్లో ఉన్న కరుణ కూతురు కనిమొళి వద్దకు పంపి ఆమె అభిప్రాయం తీసుకున్నారని తెలుస్తోంది. తన కోసం నిర్ణయాలు తీసుకోవద్దని, కేసును ఎదుర్కొనే ందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పినట్లు సమాచారం. స్కామ్‌లో డిఎంకె ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రాజా అరెస్టు, మారన్‌పై ఆరోపణల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొనడం తెలిసిందే. కేంద్రం వైఖరికి నిరసనగా యూపీఏ ప్రభుత్వం నుంచి డిఎంకె వైదొలిగే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి.
కనిమొళికి వాటాలున్న కలైంజర్ టీవీ లావాదేవీలతో 2జీ స్కామ్‌ను సీబీఐ ముడిపెట్టడాన్ని డిఎంకె తీర్మానం ఖండించింది. రుణాన్ని బ్యాంకు వ్యవహారాల ద్వారా ఓ ప్రైవేటు సంస్థ నుంచి పారదర్శకంగా స్వీకరించినట్లు తెలిపింది. 'కనిమొళి, టీవీ ఎండీ శరద్‌కుమార్‌లు విచారణకు వచ్చినప్పుడు సీబీఐ అరెస్టు చేయలేదు. వారు విచారణ కోసం ప్రత్యేక కోర్టుకు వెళ్లినప్పుడు అరెస్టు చేసింది. బెయిలు ఇవ్వొద్దని కోరింది. ఇది ఆ సంస్థ ద్వంద్వ వైఖరికి నిదర్శనం" అని విమర్శించింది.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications