అసంతృప్తిగానే దేవాదాయ శాఖ బాధ్యతలు స్వీకరించిన పొన్నాల

అయితే పొన్నాలకు బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆయన కొన్నాళ్లుగా స్తబ్దగా ఉంటూ వస్తున్నారు. దీంతో పొన్నాల బాధ్యతలు చేపడతారా లేరా అనే ప్రశ్న ఉదయించింది. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిఎంను కలిసిన పొన్నాల ఎట్టకేలకు ఉదయం దేవాదాయ శాఖ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన అసంతృప్తిగానే బాధ్యతలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. దేవాదాయ శాఖ చేపట్టిన మంత్రి ఎవరైనా రాజకీయంగా కనుమరుగు అవుతారనే కథనాల నేపథ్యంలో ఆ శాఖను చేపట్టడానికి అందరూ వెనక్కి పోతుంటారు.












Click it and Unblock the Notifications