ఇసుక కోటను నిర్మించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన జర్మనీ వాసులు
International
oi-Nageshwara
By Nageswara Rao
అత్యంత పొడవైన ఇసుక కోటను నిర్మించడం ద్వారా జర్మనీ ప్రజలు ప్రపంచ రికార్డును సృష్టించారు. గ్లో ఆన్ రూజన్ పట్టణంలోని షాబీ బీచ్‌లో ఆదివారం వారు 27.5 కిలోమీటర్ల పొడవున్న ఇసుక కోటను నిర్మించారు. ఇంతకు ముందు వరకూ అమెరికాలోని దక్షిణ కరోలినా మిర్టెల్ బీచ్‌లో ఉన్నదే ప్రపంచంలో అత్యంత పొడవైన ఇసుక కోట. 90 సెంటీమీటర్ల ఎత్తులో... 30 సెంటీమీటర్ల వెడల్పుతో ఉన్న కోటగోడ చూపరులను ఆకట్టుకుంటోంది.