జగన్ కాదంటే నాగంతో, జైపాల్ రెడ్డిది ఐరన్ లెగ్: గోనె ప్రకాశ్ రావు

Gone Prakash Rao
కరీంనగర్: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా తన నిర్ణయం తీసుకోకుంటే తాను తెలుగుదేశం పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని వైయస్ఆర్ పార్టీ నేత గోనె ప్రకాశ్ రావు సోమవారం స్పష్టం చేశారు. వచ్చే నెలలో జరిగే ప్లీనరీలో తెలంగాణపై చర్చిస్తామని చెప్పారు. జగన్ తెలంగాణకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ తెలంగాణకు అనుకూలం కాకుంటే నాగం వెంట నడుస్తానని చెప్పారు.

తెలంగాణ ప్రాంతంలో అందరూ పార్టీలకతీతంగా నాగం జనార్దన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుకు మద్దతు పలకాలని సూచించారు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి పచ్చి అవకాశవాది అని ఆయన విమర్శించారు. ఆయన ఐరన్ లెగ్ అని అన్నారు. తెలంగాణ వాదాన్ని నీరుగార్చడానికే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి ఉప ముఖ్యమంత్రి పదవిని తెరపైకి తీసుకు వచ్చారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+