నాకు బలం లేదు, చంద్రబాబుకు దమ్ములేదు: అవిశ్వాసంపై వైయస్ జగన్

ఇప్పుడు తనకు 90 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. తనకు బలం లేనందునే తాను అవిశ్వాసం పెట్టడం లేదని అన్నారు. తనకు బలం ఉంటే ఎప్పుడే తీర్మానం ప్రవేశ పెట్టే వాడినని స్పష్టం చేశారు. చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోతుందా లేదా అన్న విషయం సెకండరీ అన్నారు. ప్రభుత్వం పడిపోతే కన్నీరు పెట్టిస్తున్న ప్రభుత్వాన్ని పడగొట్టినందుకు టిడిపిని ప్రజలు అభినందిస్తారని అన్నారు. పడిపోకుంటే ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి తాము శాయశక్తులా, చిత్తశుద్ధితో ప్రయత్నం చేశామని ప్రజలకు చెప్పుకోవచ్చు అని టిడిపికి సూచించారు. ప్రతిపక్ష, అధికార పక్షాలు ఏకమయినందువల్లే అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications