సిఎం పదవి కోసం జైపాల్ రెడ్డి పావులు కదుపుతున్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి కోసం కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి పావులు కదుపుతున్నారని తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన జైపాల్ రెడ్డిపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. జైపాల్ రెడ్డి ప్రజాస్వామ్యం ముసుగులో ఉన్న పెద్ద నియంత అని ఆయన అభివర్ణించారు. జైపాల్ రెడ్డి అంతర్జాతీయవాది అవుతారు గానీ జాతీయవాది, ప్రాంతీయవాది, ఉప ప్రాంతీయవాది ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. ఇటలీ కాంగ్రెసులో ఉన్న జైపాల్ రెడ్డి కచ్చితంగా అంతర్జాతీయవాది అవుతారని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పార్లమెంటులో చేసిన ప్రకటనను అమలు చేయించాల్సిన బాధ్యత జైపాల్ రెడ్డి మీద లేదా అని ఆయన అడిగారు. పదవి కోసం జైపాల్ రెడ్డి ఏ గడ్డయినా కరుస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై ప్రకటన ద్వారా జైపాల్ రెడ్డి నిజస్వరూపం బయటపడిందని ఆయన అన్నారు. గతంలో జైపాల్ రెడ్డి సమైక్యవాదిగా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారని ఆయన గుర్తు చేశారు.

క్షమాపణ చెప్తే నాగం జనార్దన్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న జైపాల్ రెడ్డిని నిలదీయాల్సిన బాధ్యత నాగం జనార్దన్ రెడ్డిపై లేదా అని ఆయన అడిగారు. తెలంగాణ కోసం జైపాల్ రెడ్డి చేత నాగం జనార్దన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్రశ్నించారు. నాగం జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం ఉద్యమించాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+