వైయస్ జగన్‌కు మాట్లాడే అర్హత లేదు, బొత్స మద్యం వ్యాపారి: చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికిగానీ, ఆయన పక్కన ఉన్న నేతలకు కానీ అవిశ్వాసం విషయంలో తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మంగళవారం విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో రెండు రోజుల వర్క్‌షాప్ కార్యక్రమంలో భాగంగా ఆయన పార్టీ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌కు అవిశ్వాసంపై మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ పెద్ద మద్యం వ్యాపారి అని చంద్రబాబు విమర్శించారు. పిసిసి పీఠంపై కూర్చుండ బెట్టడానికి బొత్స కంటే నీతిపరుడు మరొకరు కాంగ్రెసు అధిష్టానానికి కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు.

అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అధిష్టానానికి రాసిన లేఖకు పార్టీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భారత రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ అవసరం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా ఎదిగిందన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలను శాసించలేరన్నారు. బిజెపితో పాటు కాంగ్రెసు కూడా మతసామరస్యాన్ని కాపాడాలని సూచించారు. అకాల వర్షాలు పడి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వలేని పరిస్థితులో అధికార కాంగ్రెసు ప్రభుత్వం ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చేతకాని, పనికిరాని ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. రైతాంగ సమస్యలపై టిడిపి పలు ఆందోళనలు చేపట్టిందని గుర్తు చేశారు.

అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. గోదాముల్లో ధాన్యం నిలువలు పెరిగాయన్నారు. రైతులకు విత్తనాలు దొరకని పరిస్తితి ఏర్పడిందన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున ఓ కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బడుగు, బలహీన వర్గాలు రాజకీయంగా ఎదిగాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు కనీసం తిండిలేకుండా బతుకుతున్నారన్నారు. ఆర్థికంగా, సామాజికంగా అల్పసంఖ్యాక వర్గాలను ముందుకు తీసుకు పోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+