కాంగ్రెసు అధిష్టానం ఐదుగురి జట్టులో ఎవరెవరున్నారు?

మొదటి ఐదుగురిని జట్టుగా తీసుకుంటే కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఇద్దరున్నారు. పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణది అత్యంత కీలకమైన బాధ్యత అనేది అర్థమైపోతూనే ఉన్నది. ఆ విషయాన్ని బొత్స సత్యనారాయణే స్వయంగా చెప్పారు. పైగా, ఆయన వ్యవహరిస్తున్న తీరు కూడా అందుకు అనుగుణంగానే ఉంది. చిరంజీవి పాత్ర ఏమిటనేది తెలియడం లేదు. అయితే, అవసరమైతే రంగంలోకి దిగడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నట్లే కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి బద్ధశత్రువు అయిన శానససభ్యుడు రామచంద్రా రెడ్డితో చిరంజీవి బుధవారం భేటీ కావడాన్ని బట్టి ఆ విషయం తెలిసిపోతూనే ఉన్నది.
ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టాల్సి ఉంటుంది. మంత్రులను ఏకతాటిపై నడిపించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే కిరణ్ కుమార్ రెడ్డి ఐఎఎస్ అధికారులను భారీగా బదిలీ చేయడం ద్వారా వ్యవహరించారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకునే విషయంలో కీలక పాత్ర పోషించనున్నారు. శాసనసభలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఎదురైతే కాపాడడం కూడా ఆయన బాధ్యతల్లో భాగమని అంటున్నారు. ఇక, దామోదర రాజనర్సింహ విషయానికి వస్తే దళితులను సమీకరించే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. పాలనా యంత్రాంగంలో, పార్టీ వ్యవహారాల్లో ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి, బొత్స సత్యనారాయణకు సహకరించే అవకాశాలున్నాయి. మల్లుభట్టి విక్రమార్క మాలలు పార్టీకి దూరం కాకుండా చూస్తారని అంటారు.












Click it and Unblock the Notifications