రాజీనామా చేసి గెలవాలి: చిరుకు జగన్ వర్గం నేత భూమన సవాల్

Bhumana Karunakar Reddy
తిరుపతి/హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి నైతికత ఉంటే తాను, తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలవాలని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం తిరుపతిలో సవాల్ చేశారు. వైయస్ జగన్‌ను విమర్శించే అర్హత చిరంజీవికి లేదని ఆయన అన్నారు. నైతిక విలువల గురించి చిరంజీవి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే అన్నారు. కాగా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, రాష్ట్ర మంత్రి జానారెడ్డిపై గోనె ప్రకాశరావు హైదరాబాదులో ధ్వజమెత్తారు. వారు తెలంగాణ సెంటిమెంట్‌ను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లకు సంబంధించి జగన్ చేసిన ప్రతిపాదనలను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వక్రీకరిస్తున్నారని బాజిరెడ్డి గోవర్థన్ వేరుగా అన్నారు. బిసీ రిజర్వేషన్లపై బొత్సకు చిత్తశుద్ధి లేదన్నారు. బిసిల భూజాన తుపాకీ పెట్టి స్థానిక ఎన్నికలను కాల్చి పారేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని మరో నేత గట్టు రామచంద్రరావు ఆరోపించారు. జగన్‌పై, పార్టీపై అనవసర విమర్శలు చేస్తున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+