పవర్ సెంటర్ పాలి'ట్రిక్స్': పిసిసి చీఫ్ బొత్సపై సిఎం కిరణ్ నిఘా!

తన పీఠాన్ని ఎప్పుడు తన్నుకుపోతాడో అనే భయంతో వచ్చే ఎన్నికలలో తన పీఠాన్ని భద్రంగా ఉంచుకునేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ పిసిసి చీఫ్ బొత్సపై నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. సత్తిబాబు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో ఎవరెవరితో ముచ్చటిస్తున్నారు, ఏయే అధికారులతో సమావేశాలు జరుపుతున్నారు అనే విషయంపై తెలుసుకునేందుకు నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం, పార్టీ వేరు కాదన్న బొత్స వ్యాఖ్యల్లో కూడా ముందుచూపు ఉన్నట్టుగా సిఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలా చెప్పడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా కాస్త తలదూర్చవచ్చనే ఉద్దేశ్యంతోనే బొత్స ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా భావిస్తున్నారు.
అందుకే బొత్స ఏయే మంత్రులతో భేటీ అవుతున్నారనే విషయమే కాకుండా ఆయనకు సన్నిహితంగా మెలిగే మంత్రుల వివరాల విషయాలపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతేకాదు వారితో బొత్స ఏం మాట్లాడుతున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నాలు సిఎం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తద్వారా తనకు వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో ఉన్న ఒక ప్రధాన ముఖ్యమంత్రి అభ్యర్థిని బలహీనపర్చవచ్చునని సిఎం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications