కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ప్రియుడిని చంపిన ప్రియురాలి బంధువులు

దానికి స్రవంతి తల్లిదండ్రులు అమ్మాయి చదువు తర్వాత పెళ్లి చేద్దామని చెప్పారు. అయితే ఆ తర్వాత స్రవంతికి ప్రసాద్ అనే మరో యువకుడితో పెళ్లి చేశారు. అయితే తన ప్రేమను మరిచిపోని కిరణ్ స్రవంతికి ఫోన్లు చేయడం ప్రారంభించాడు. ఇది తెలుసుకున్న ప్రసాద్ సోదరుడు శ్రీనాథ్ గురువారం కిరణ్‌ను తీవ్రంగా కొట్టాడు. అయితే గ్రామస్తులు సర్ది చెప్పడంతో శ్రీనాథ్ వెళ్లి పోయినప్పటికీ తిరిగి శుక్రవారం వచ్చి కిరణ్‌ను పక్కనే ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లి బలవంతంగా స్ప్రైట్ బాటిల్‌లో పురుగుల మందు కలిపి తాగించాడు. గమనించిన గ్రామస్తులు కిరణ్‌ను హాస్పిటల్ తరలించేలోగా మృతి చెందాడు. నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications