ఎర్రబెల్లి దయాకరరావును అడ్డుకున్న టిఆర్ఎస్ కార్యకర్తలు, అరెస్టు

Errabelli Dayakar Rao
వరంగల్: తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, పిఎసి చైర్మన్ ఎర్రబెల్లి దయాకరరావును తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి వారు శుక్రవారం వరంగల్ జిల్లాలోని తొర్రూరులో అడ్డుకున్నారు. తొర్రూరులో ఓ కార్యక్రమానికి హాజరు అయిన ఎర్రబెల్లి దయాకరరావును టిఆర్ఎస్ అడ్డుకుంది. ఎర్రబెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయకుంటే పార్టీ అధినేతతో తెలంగాణకు అనుకూలంగా స్టేట్ మెంట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.

వారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కలుగజేసుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. వారు ఎంతకీ తగ్గక పోవటంతో పోలీసులు సుమారు పదిహేను మంది తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల టిడిపి నుండి నాగం జనార్దన్ రెడ్డి బహిష్కరించబడిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలపై ఒత్తిడి పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+