ఎంపీ కోట్ల వర్సెస్ ఎమ్మెల్యే నీరజారెడ్డి: రాజీనామా చేసిన ఎమ్మెల్యే

ఈ కారణంగా ఎమ్మెల్యేగా ఉండి కూడా తన కార్యకర్తలకు చిన్న చిన్న పనులు కూడా చేసిపెట్టలేకపోతున్నానని తన రాజీనామా పత్రంలో ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థాయి అధికారులు కూడా తనమాట వినడం లేదని వాపోయారు. గతంలో ఆలూరు సీటును తన బావమరిది హాలహర్వి కేశవరెడ్డికి సీటు ఇప్పించుకోవడానికి గత సాధారణ ఎన్నికల్లో కోట్ల ప్రయత్నించారు. అయితే నీరజ నేరుగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని కలిసి సీటు ఖరారు చేసుకున్నారు. ఈ కారణంగా కోట్ల తన ఓటమికి ప్రయత్నించారని కూడా ఆమె విమర్శించారు. గతంలో కూడా పలుమార్లు నీరజ కోట్లపై విమర్శలు గుప్పించారు. గత జనవరిలో అంగన్ వాడీ పోస్టు వ్యవహారంలో కూడా ఇరువురు మధ్య వివాదం మరింత పెంచిందని కూడా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications