తెలంగాణను చంద్రబాబు అడ్డుకున్నారు!: టిడిపి ఎమ్మెల్యే బోడ

టిడిపి నుండి సస్పెండ్ అయిన వారమంతా సమావేశం అయి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలోని పది జిల్లాలో తనలాంటి వారున్నారన్నారు. తాను టిడిపి బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డితో ఎప్పుడూ తిరగలేదన్నారు. నాగర్ కర్నూల్ సభ పార్టీలకతీతంగా జరిగిందని అందుకే పాల్గొన్నానని చెప్పారు. ఒకవేళ పార్టీ తనకు పాల్గొనవద్దని చెప్పినా ఊరుకునే వాణ్ణని అన్నారు. నేనెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేదన్నారు. తాను తెలంగాణ వాదం వినిపించినందుకే తనపై వేటు వేశారని అన్నారు.












Click it and Unblock the Notifications