దమ్ముంటే తెలంగాణలో పోటీ చెయ్: లగడపాటికి హరీష్‌రావు సవాల్

Harish Rao
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు దమ్ముంటే తెలంగాణలో పోటీ చేసి చూపించాలని ఆదివారం సవాల్ విసిరారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు పట్నం రోడ్లపై పొయ్యి పెడతాం కార్యక్రమంలో భాగంగా ఆయన హైటెక్ సిటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కూడా చాలామంది సమైక్యాంధ్ర కోరుకుంటున్నారని లగడపాటి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తెలంగాణలో సమైక్యాంధ్ర కోరుకున్న వారు ఉన్నారని భావిస్తే లగడపాటి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ వచ్చి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.

వంటావార్పు కార్యక్రమంలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ కూడా పాల్గొనవచ్చునని ఆయన సూచించారు. ఇప్పటికైనా కాంగ్రెసు నేతలు రాజీనామాలు చేయాలని ఆయన సూచించారు. లేదంటే రేపటి నుండి వారి ఇళ్ల ముందు పొయ్యి పెడతామని హెచ్చరించారు. ప్రజలను తెలంగాణ సెంటిమెంటే రోడ్లపైకి రప్పిస్తుందని అన్నారు. సీమాంధ్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఆయన హెచ్చరించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఇక్కడున్న సీమాంధ్ర ప్రజలే నష్టపోతారని చెప్పారు. ఇక నుండి చెప్పకుండా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+