వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విద్యార్థి మరణం కలిచి వేసింది: తెలంగాణకు మద్దతు పలికిన హీరో సుమన్

కేంద్రం తెలంగాణపై త్వరలో ఓ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. వంటా వార్పు కార్యక్రమంతో ఎవరికీ ఇబ్బంది లేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలతో పాటు తెలుగు ప్రజలంతా సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. సినిమా పరంగా తనకు ఎలాంటి నష్టం జరగదన్నారు. నేను చేసేది మంచి కార్యక్రమం అయినప్పుడు దాని గురించి ఆలోచించవలసిన పని లేదన్నారు. తాను ఈ కార్యక్రమం ద్వారా ఏదీ ఆశించడం లేదన్నారు. తెలంగాణ భౌతికంగా విడిపోయినప్పటికీ అందరూ కలిసే ఉంటారని ఆయన అన్నారు. కాగా తెలంగాణ వంటావార్పు కార్యక్రమంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన పలువురు ఉద్యోగులు పాల్గొని మద్దతు తెలపడం విశేషం.