సుప్రీంకోర్టులోనూ కనిమొళికి చుక్కెదురు, మరింత జైలులోనే

సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశాలున్నాయనే ఉద్దేశంతో కనిమొళికి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. సిబిఐ ప్రత్యేక కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే కారణంతో ఆమెకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాయి. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సిబిఐ కనిమొళిని మే 20వ తేదీన అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉంటున్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సిబిఐ టెలికం మాజీ మంత్రి ఎ రాజాతో పాటు కనిమొళిని సహ కుట్రదారుగా చేర్చింది.












Click it and Unblock the Notifications