రష్యాలో విమానం కూలి 44 మంది ప్రయాణికులు దుర్మరణం

రవాణా నిబంధనలను నిర్లక్ష్యం చేయడంపై క్రిమినల్ దర్యాప్తు జరిపిస్తున్నట్లు రష్యా దర్యాప్తు కమిటీ అధికార ప్రతినిధి వ్లదిమీర్ మార్కిన్ చెప్పారు. విమానంలోని ప్రయాణికుల జాబితాను మాస్కోలోని ఎమర్జెన్సీస్ మంత్రిత్వ శాఖ అందజేసింది. కాగా, కరేలియా మంత్రిత్వ శాఖ బతికి బయటపడ్డ ఎనిమిది మంది జాబితాను వెల్లడించింది. విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. వాతావరణం బాగా లేకపోవడం పల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని 24 గంటల న్యూస్ చానెల్ వెస్టీ ఏవియేషన్ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది.












Click it and Unblock the Notifications