బొత్స సత్యనారాయణకు చిరంజీవి సలహాలు, పట్టుకు ప్రయత్నాలు

కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనానికి ఎన్నికల కమిషన్ పచ్చజెండా ఊపినా ఇరు పార్టీల పరంగా విలీన ప్రక్రియ పూర్తి కాలేదు. విలీన సభను భారీ యెత్తున నిర్వహించాలని చిరంజీవి భావిస్తున్నారు. తిరుపతిలో విలీన సభ జరపాలని తనకు ఉన్నట్లు చిరంజీవి ఇటీవల తన మనోగతాన్ని బయటపెట్టారు. అయితే, రాజమండ్రిలో గానీ విజయవాడలో గానీ ఆ సభను నిర్వహించినా ఫరవా లేదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. జులై 10, ఆగస్టు 15వ తేదీ మధ్య కాలంలో విలీన సభ జరగాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై పార్టీ సీనియర్లతో ఆయన చర్చలు జరుపుతున్నారు.
విలీన సభ బొత్స సత్యనారాయణ తడాఖాను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, పార్టీ అధిష్టానానికి చూపించే ఉద్దేశంతో చిరంజీవి ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ గాడిలో పడిందనే సందేశాన్ని విలీన సభ ద్వారా ఇవ్వాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈలోగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను దారికి తేవడమో, వారిపై చర్యలు తీసుకోవడమో చేయాలని బొత్స సత్యనారాయణ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే, విలీనసభకు బొత్స అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications