వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను తెలంగాణకు వ్యతిరేకం, ప్రత్యామ్నాయం ఉంది!: మమతా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mamata Banerjee
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తెలంగాణ రాష్ట్రంపై తన అభిప్రాయాన్ని చెబుతూనే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో జోక్యం చేసుకోనని చెప్పడం విశేషం. మమతా బెనర్జీ మంగళవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం అని చెప్పారు. అయితే తెలంగాణ ప్రజల మన్నన పొందడానికి ప్రత్యామ్నాయం ఉందని ఆమె స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా ప్రత్యేక గూర్ఖాలాండ్ కోరుతున్నారని ఆమె గుర్తు చేశారు. దశాబ్దాలుగా నలుగుతున్న గూర్ఖాలాండ్ సమస్యను తాని ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీర్చానని అన్నారు.

గూర్ఖాలాండ్ కోరితే తాను స్విట్జర్లాండ్ చేస్తానని చెప్పానని అన్నారు. తెలంగాణ ఇవ్వకుండా ప్రత్యామ్నాయం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే తాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విషయంలో జోక్యం చేసుకోనని ముక్తాయించారు. తెలంగాణ అంటే తనకు అభిమానం ఉందని, అయితే ప్రత్యేక రాష్ట్రం అంశం విషయంలో తాను జోక్యం చేసుకోనన్నారు. తెలంగాణ ప్రజలు ఆ విషయాన్ని కేంద్రంతో తేల్చుకోవాలన్నారు. అయితే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

English summary
Mamata Banerjee opposed seperate Telangana. She said that there is a alternate to seperate telangana. She said she is not interfere in AP issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X